చెరువులో పడి బాలుడు మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

by Satheesh |   ( Updated:2022-12-16 16:54:13.0  )
చెరువులో పడి బాలుడు మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
X

దిశ, నల్లబెల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామానికి చెందిన మడత అభినవ్ (13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా.. శుక్రవారం పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పశువులు మధ్యాహ్న సమయంలో చెరువులోకి వెళ్లాయి. వాటిని బయటకు కొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని బయటకు తీస్తున్న క్రమంలో చెరువు కట్టపై కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.

Advertisement

Next Story