జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చి చంపిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?

by Anjali |
జీతం ఇవ్వలేదని మంత్రినే కాల్చి చంపిన బాడీగార్డ్.. ఎక్కడంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో రకాల గొడవలతో జరుగుతోన్న హత్య ఘటనలను చూస్తున్నాం. కానీ జీతం ఇవ్వలేదనే కారణంతో ఓ మంత్రినే కాల్చి చంపిన ఘోరమైన ఘటన ఉగాండా రాజధాని కంపాలా శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. బాధితుడు చార్లెస్ ఎంగోలా రిటైర్డ్ ఆర్మీ కల్నల్. ఆయన ప్రెసిడెంట్ యోవేరి ముసెవేని ప్రభుత్వంలో కార్మిక శాఖకు జూనియర్ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే చాలా కాలం నుంచి ఆయన బాడీగార్డ్‌కు జీతం ఇవ్వట్లేదట. దీంతో ఆగ్రహానికి గురైన బాడీగార్డ్ మంత్రి ఇంట్లో ఒక్కడే ఉన్న సమయం చూసి అతడిని కాల్చి చంపాడు. తర్వాత గార్డు కూడా కాల్చుకుని మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ కాల్పులకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. కానీ.. శాలరీ విషయంలోనే వివాదం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story