- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ రహదారి పై నిలిచి ఉన్న డీసీఎం ను ఢీ కొట్టిన బైక్..
by Sumithra |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం 44వ జాతీయ రహదారి పై ఆగివున్న డీసీఎం ను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనం పై ఉన్న ముగ్గురు యువకులలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తివివరాల ప్రకారం ఇంధల్వాయి మండలం మెగ్యనాయక్ తండా (ఎత్తు తాండా) కు చెందిన యువకులుగా గుర్తించారు.
ఎత్తు తండా గ్రామానికి చెందిన బాధవత్ నితిన్, బాధవత్ ప్రవీణ్, దెగవాథ్ రామ్ యువకులు స్వగ్రామం నుండి డిచ్ పల్లి వెళ్తుండగా ఇంధల్వాయి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన లో దెగవాథ్ రామ్ అనే యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్ లు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Advertisement
Next Story