- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో పల్టీ.. పలువురికి గాయాలు
దిశ, మల్హర్: విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటో పల్టీ కొట్టి విద్యార్థులకు గాయాలైన సంఘటన మల్హర్ మండల పరిధిలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిన్న తూండ్ల, మల్లారం గ్రామాలకు చెందిన విద్యార్థులు మల్లారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. పదో తరగతి పరీక్షల నిమిత్తం దాదాపు13 మంది విద్యార్థులు ఉట్నూరి సదానందంకు చెందిన ఆటోలో వెళ్లి మండల కేంద్రంలోని తాడిచెర్ల ఉన్నత పాఠశాలలో పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం పరీక్ష రాసిన అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా ఆటోలో బయలుదేరగా ఓ మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది.
దీంతో తెల్లం స్వరూప అనే విద్యార్థినికి తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్వరూపను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. పులిగంటి ప్రణీత్ కుమార్, ముక్కెర వేన అఖిల, మేకల హరీష్, జంబోజు హర్షిత, లింగన్నపేట హర్షిత లకు స్వల్ప గాయాలు కావడంతో భూపాల్ పల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా స్వల్ప గాయాలతో విద్యార్థులకు ప్రాణాపాయం తప్పడంతో వారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు.