- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Arrested : అల్లుని హత్య చేసిన అత్త అరెస్ట్...
దిశ, నారాయణఖేడ్ : కూతురిని నిత్యం వేధిస్తున్నడనే కారణంతో ఓ అత్త అల్లుడిని హత్య చేసిన సంఘటన నారాయణఖేడ్ మండలం పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ రెడ్డి , ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… నారాయణఖేడ్ మండలం పరిధిలోని సంజీవ రావ్ పేట గ్రామానికి చెందిన లావణ్యకు ర్యాలమడుగు గ్రామానికి చెందిన మహేష్ కు 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు ఆడపిల్లలు ఉండగా మద్యానికి బానిసైన మహేష్ భార్యను అనుక్షణం వేధించడంతో పాటు తన తండ్రి చనిపోగా వచ్చిన డబ్బులను మొత్తం దుబారాగా ఖర్చు పెట్టేశాడని, మిగిలి ఉన్న రెండు ఎకరాల భూమిని సైతం అమ్మి వేస్తానని చెప్పడంతో లావణ్య తన ముగ్గురు పిల్లలు తీసుకొని అమ్మగారి ఇంటికి వెళ్ళింది.
దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన లావణ్య తల్లి వీరమణి ఎలాగైనా అల్లుడిని చంపితేనే తన కూతురు జీవితం బాగుపడుతుందని, పథకం ప్రకారం తనకు తెలిసిన నర్సాపూర్ వ్యక్తి కిష్టతో కలిసి నారాయణఖేడ్ మండలంలోని జూకల్ శివాలోని మెట్రో డాబా పక్కకి తీసుకెళ్లి బాగా మద్యం తాగించి తను లేవలేని పరిస్థితుల్లో ఉండగా ఒక బండ రాయితో తలకు రెండు వైపుల గట్టిగా కొట్టడంతో మహేష్ అక్కడికక్కడే రక్తం కక్కుని చనిపోయాడని విచారణంలో నిందితురాలు వీరమణి ఒప్పుకున్నట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి,ఎస్సై విద్యా చరణ్ రెడ్డి తెలిపారు. కాగా హత్య చేసిన వీరమణిని ఆమెకు సేకరించిన నర్సాపూర్ గ్రామానికి చెందిన కృష్ణయను రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరుచుతామని తెలిపారు.