జనగామకు వెళ్లి వస్తానని...అనంతలోకాలకు

by Sridhar Babu |
జనగామకు వెళ్లి వస్తానని...అనంతలోకాలకు
X

దిశ, లింగాలఘణపురం : జనగామకు వెళ్లి వస్తానని బయలుదేరిన ఊర దయాకర్ (28 ) అనే యువకుడు మార్గమధ్యలోనే మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని కళ్లెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భవనగిరి యాదాద్రి జిల్లా మోట కొండూరు మండలం తేరాల గ్రామానికి చెందిన దయాకర్ రాత్రి జనగామలో పని ఉందని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

తిరిగి తేరాల గ్రామానికి వస్తుండగా కళ్లెం గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి మోరీని ఢీకొట్టడంతో పక్కనే ఉన్న గుంతలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. మృతునికి ఐదు నెలల కూతురు, భార్య భవాని ఉన్నారు.

Advertisement

Next Story