రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు

by Shiva |
రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు
X

పెళ్లి బట్టల కోసం ఆటోలో వెళ్తుండగా ప్రమాదం

రామాయంపేట ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స

దిశ చేగుంట : ఆటో బ్రేకులు ఫెయిలై చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో పది మందికి గాయాలైన ఘటన చేగుంట మండల పరిధిలోని బోనాల గ్రామం వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం త్వరలో తమ ఇంట్లో జరగనున్న పెళ్లి వేడుక కోసం నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందకు ఆటోలో రామాయంపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మండల పరిధిలోని బోనాల గ్రామ శివారు వద్దకు రాగానే బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదిమందికి గాయాలు కాగా, క్షతగాత్రులను 108 వాహనంలో రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story