ముంబైలో దారుణం.. తెలుగు నటిపై అత్యాచారం

by GSrikanth |   ( Updated:2022-09-14 04:35:30.0  )
ముంబైలో దారుణం.. తెలుగు నటిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస అత్యాచార ఘటనలు మహిళలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వావివరుసలు, చిన్నాపెద్దలు అనే తేడా లేకుండా కొందరు చేస్తున్న దుర్మార్గాలకు అమాయకులు బలైపోతున్నారు. పేదల నుంచి ప్రముఖుల వరకూ అందరూ ఈ తరహా దారుణాలకు పాల్పుడుతున్నారు. తాజాగా.. ఓ తెలుగు నటిపై అత్యాచారం జరుగడం కలకలం రేపుతోంది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముంబై నగరంలో కూఫీ పరేడ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదిత్యకపూర్ అనే ఫిట్‌నెస్ ట్రైనర్ జిమ్ నడుపుతున్నాడు. అందులో ఓ తెలుగు నటి ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆదిత్యకపూర్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తెలుగు నటిపై అత్యాచారం చేశాడు. మోజు తీరాకా, పెళ్లికి నిరాకరిస్తున్నాడని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక, వివాహం ప్రస్తావన తీసుకొచ్చినందుకు తనను విచక్షణారహితంగా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. తన అశ్లీల చిత్రాలు నిందితుడి వద్ద ఉన్నాయని వాటిని బహిర్గతం చేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదిత్యకపూర్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : మరిదితో నగ్నంగా బెడ్‌పై భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో షాక్


Advertisement

Next Story