suicide attempt : పోలీస్ స్టేషన్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |   ( Updated:2024-11-05 15:55:57.0  )
suicide attempt : పోలీస్ స్టేషన్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం
X

దిశ, కోరుట్ల టౌన్ : పోలీస్ స్టేషన్ ముందు యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోరుట్లలో మంగళవారం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే కోరుట్ల పట్టణానికి చెందిన షారూక్ అనే యువకుడు కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకుని సదరు యువకుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలిసింది.

Advertisement

Next Story