- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వడదెబ్బతో విద్యార్థి మృతి.. ఫ్యామిలీకి రూ.110 కోట్ల నష్ట పరిహారం
దిశ, వెబ్‌డెస్క్: వడదెబ్బతో ఓ విద్యార్థి మృతి చెందగా యూనివర్సిటీ భారీ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ కుమారుడి మరణానికి అమెరికాలోని యూనివర్సిటీ యాజమాన్యమే కారణమంటూ బాధిత కుటుంబం ఆరోపించగా యూనివర్సిటీ 14 మిలియన్ డాలర్ల(రూ.110 కోట్లు) పరిహారం చెల్లించడానికి ఒప్పుకుంది. అమెరికాలోని కెంటకీ యూనివర్సిటీలో రెజ్లింగ్ కు సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో బ్రేస్ అనే 20 ఏళ్ల యువకుడు పాల్గొన్నాడు.
అయితే, శిక్షణలో అలసిపోయిన యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. దాహం తీర్చుకోవడం కోసం అక్కడున్న వారిని అభ్యర్థించాడు. అందుకు అక్కడున్న కోచ్ లు నిరాకరించారు. శిక్షణ అంటూ అక్కడ ఉన్న వారిని నీరు ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో డీ హైడ్రేషన్ కు గురైన బ్రేస్ కాసేపటికి చనిపోయాడు. తన కుమారుడి మరణానికి యూనివర్సటీ యాజమాన్యమే కారణమంటూ బ్రేస్ ఫ్యామిలీ సభ్యులు కోర్టులో దావా వేశారు. దీంతో బాధిత కుటుంబానికి 14 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు యూనివర్సిటీ ముందుకొచ్చింది. శిక్షణ పాల్గొన్న ఇద్దరు కోచ్ లు రాజీనామా చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది.