- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విరాట్ కోహ్లీ సరిగా క్రికెట్ ఆడలేదని విద్యార్థి ఆత్మహత్య..!

దిశ, కామారెడ్డి : ఇటీవల దుబాయిలో న్యూజిలాండ్, ఇండియాతో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సరిగా ఆడలేదని మనస్థాపం చెందిన పదో తరగతి చదివే క్రికెట్ ప్రేమికుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ సంఘటన కామారెడ్డి జిల్లా గర్గుల్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లపు శరత్ కుమార్ (16) అనే విద్యార్థికి క్రికెట్ అంటే అభిమానం ఎక్కువ.
క్రికెట్ మీద ఉన్న అభిమానంతో అతను ఇటీవల జిల్లా జట్టు తరఫున అండర్ 16 విభాగంలో హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కూడా ఆడి గెలుపొంది వచ్చినట్లుగా తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ ఇండియా గెలిచినప్పటికీ ఫైనల్ మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేయడంతో మనస్థాపం చెంది గత మూడు రోజులుగా తనలోనే తాను కుమిలిపోతూ ఉన్నాడని తెలిపారు. కాగా కుటుంబీకులు మాత్రం శరత్ కుమార్ గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండేవాడని, ఆ బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడినట్లు ఫిర్యాదు చేసినట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు.