ఒడిషాలో మరో ఘోరం.. ఆరుగురు రైల్వే కూలీలు స్పాట్ డెడ్

by Satheesh |   ( Updated:2023-06-07 14:35:36.0  )
ఒడిషాలో మరో ఘోరం.. ఆరుగురు రైల్వే కూలీలు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిషాలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 280 మంది మరణించగా.. 1000 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనను ఇంకా పూర్తిగా మరవకముందే ఒడిషాలోని ఓ రైల్వే స్టేషన్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు రైల్వే కూలీలు మృతి చెందారు. ఒడిషాలోని ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో కొంత కాలంగా ఇంజిన్ లేని గూడ్స్ రైలు బోగీలు నిలిపి ఉన్నాయి. కాగా, రైల్వే కూలీలు బుధవారం బోగీలకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఆ కూలీలు తలదాచుకునేందుకు గూడ్స్ బోగీ కిందకు వెళ్లారు. అయితే, భారీ ఈదురు గాలులతో ఆ బోగీ ముందుకు కదిలింది. దీంతో వర్షం నుండి తలదాచుకునేందుకు బోగీ కిందకు వెళ్లిన ఆరుగురు రైల్వే కూలీలు మృతి చెందారు.

Advertisement

Next Story