యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు..

by Hamsa |
యువకుడి ప్రాణం తీసిన సిక్స్ ప్యాక్ మోజు..
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: సిక్స్ ప్యాక్ మోజు ఓ జిమ్ ట్రైనర్ ప్రాణం తీసింది. ఈ విషాదం చెన్నై సిటీలో జరిగింది. ఆకాశ్ అనే యువకుడు రెండేళ్లుగా ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పని చేస్తున్నాడు. అదే సమయంలో తానూ కసరత్తులు చేస్తున్నాడు. త్వరగా సిక్స్ ప్యాక్ బాడీ సాధించాలని కొంత కాలంగా స్టెరాయిడ్ ఇంజక్షన్లు తీసుకుంటున్నాడు. దాంతో ఆరోగ్యం దెబ్బతిని రెండు రోజుల క్రితం రక్తపు వాంతులు చేసుకున్నాడు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు.

Advertisement

Next Story