పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి..

by Sumithra |
పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి..
X

దిశ, కాల్వశ్రీరాంపూర్ : పిడుగుపాటుతో గొర్ల కాపరి మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన జంగం కొమురయ్య (48) సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొర్ల కాపర్లు మంగపేట గ్రామశివారులో గొర్లు కాస్తుండగా ఆకస్మాత్తుగా పిడుగు పడటంతో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు గొర్రెలను మేపుతున్న మరో ఆరుగురికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.

కొమురయ్య పై పిడుగు పడుతున్న సందర్భాన్ని చూసి మిగతా కాపర్లందరూ పరిగెత్తారు. దీంతో ప్రాణాపాయం నుండి వారు బయటపడ్డారు. కొమురయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు స్థానిక ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించి కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మృతునికి భార్య కోమలత ఇద్దరు కుమారులు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులను సర్పంచ్ కాసం శ్రీనివాసరెడ్డి, ఎంపీటీసీ జట్టి దేవన్నతో పాటు పలువురు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Next Story