కొడుకును గల్ఫ్​ పంపింది...తాను ప్రాణం తీసుకుంది...

by Sridhar Babu |
కొడుకును గల్ఫ్​ పంపింది...తాను ప్రాణం తీసుకుంది...
X

దిశ, బోయిన్పల్లి : కొడుకును గల్ఫ్​ పంపి తాను ప్రాణం తీసుకున్న ఓ మాతృమూర్తి విషాద ఉదంతం ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాక గ్రామానికి చెందిన కత్తెరపాక కనకవ్వ (52) అనే మహిళకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కాగా పెద్దకొడుకును ఉపాధి నిమిత్తం గల్ఫ్ కు పంపగా రూ. 5 లక్షల వరకు అప్పు అయింది. ఆ అప్పును ఎలా తీర్చాలనే మనోవేధనతో ఇంట్లో నుంచి వెళ్లి మధ్య మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు కొడుకు కత్తెరపాక అఖిల్ ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బోయినిపల్లి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ వెల్లడించారు.

Advertisement

Next Story