సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఏడుగురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు

by Satheesh |   ( Updated:2023-02-15 15:36:10.0  )
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. ఏడుగురు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్ మండలం దుర్గా తండాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిషా రాష్ట్రానికి చెందిన ఏడుగురు మైనర్ బాలికలను బట్టీ ఓనర్ లైంగికంగా వేధించినట్లు సమాచారం. యజమాని వేధింపులు తట్టుకోలేక మైనర్ బాలికలు ఒడిషా సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.అంతేకాకుండా తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎస్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒడిషా సీఎస్‌ తెలంగాణ కార్మిక శాఖకు కంప్లైంట్ చేశారు. ఒడిషా సీఎస్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన తెలంగాణ కార్మిక శాఖ అధికారులు బట్టీల్లో మగ్గుతున్న 72 మంది కార్మికులకు విముక్తి కలిగించారు. ఈ ఘటనపై నారాయణ ఖేడ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story