- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సులో రెచ్చిపోయిన కామంధుడు.. నిద్రపోతున్న యువతిపై లైంగిక వేధింపులు
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఎన్ని చట్టాలు వస్తున్నప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. మగాళ్లు వాళ్లపై మృగాళ్ల పడిపోతూ వారి కామవాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఇలాంటి సంఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన 20 ఏళ్ల యువతి భారత దేశ సంస్కృతి సాంప్రదాయాలు నచ్చి తమిళనాడులో ఉంటుంది. అక్కడ విళుపురం జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటూ స్థానిక ప్రజలకు తోచిన సహాయం చేస్తుంటుంది.
అయితే.. ఇటీవల విదేశీ యువతి స్నేహితురాలను కలిసేందుకు పుదుచ్చేరిలో ప్రైవేట్ బస్సెక్కి కర్ణాటక రాజధాని బెంగళూరుకు బయలుదేరింది. ఆ క్రమంలోనే బస్సులో ఆమెను ఒంటరిగా ఉండటం చూసిన ఓ వ్యక్తి నీచానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఆమె నిద్రపోతుండగా ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మెలుకువ వచ్చిన యువతి గట్టిగా అరవడంతో బస్సును పక్కకు నిలిపారు. అనంతరం యువకుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అంటూ విదేశీ యువతి బస్సు సిబ్బందికి, తోటి ప్రయాణికులకు తెలిపింది.
అయితే దీనిని వారు అంతా సీరియస్‌గా తీసుకోలేదు. ఆ యువకుడిని మందలించి బస్సు నుంచి దింపేశారు. కానీ, ఆ యువతి మాత్రం ఆ విషయాన్ని అంత తొందరగా విడిచిపెట్టలేదు. బెంగళూరు నుంచి తమిళనాడుకి తిరిగొచ్చిన యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లైంగిక వేధింపులకు పాల్పడిన యువకుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బస్సు ప్రయాణికుల వివరాలను సేకరించగా నిందితుడు బెంగళూరుకు చెందినవాడిగా గుర్తించారు. అక్కడ పోలీసుల సహాయంతో అతడిని గాలిస్తున్నారు.