దారుణం.. మహిళ కానిస్టేబుల్ పై లైంగికదాడి

by Jakkula Mamatha |   ( Updated:2024-10-22 13:25:40.0  )
దారుణం.. మహిళ కానిస్టేబుల్ పై లైంగికదాడి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల మహిళలపై లైంగికదాడులు(sexual assault) ఆపై హత్యలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో మహిళ కానిస్టేబుల్(constable)పై లైంగికదాడి జరిగిన ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ఆ మహిళ(29) ఉంటున్న పరిసర ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మహిళ కానిస్టేబుల్(constable) తన షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఆమెకు లిఫ్ట్ ఇచ్చాడు. కర్వా చౌత్ జరుపుకునేందుకు కాన్పుర్‌లోని తన అత్తమామల ఇంటికి మహిళా హెడ్ కానిస్టేబుల్(Female Head Constable) వెళ్తుందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె ఒంటరిగా ఉందని గమనించిన నిందితుడు పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు(Police) అరెస్ట్ చేసినట్లు సమాచారం. తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసిన మహిళ ఆ నిందితుడి వేలిని కొరికింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed