బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగికదాడి

by Sridhar Babu |   ( Updated:2024-09-26 14:19:10.0  )
బహిర్భూమికి వెళ్లిన యువతిపై లైంగికదాడి
X

దిశ,నవాబుపేట : మండల పరిధిలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన బొంత శివ అనే యువకుడిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఈనెల 14వ తేదీ ఉదయం గ్రామ సమీపంలో గల కోమటి రాములు పొలంలోకి బాధితురాలు బహిర్భూమికి వెళ్లగా అక్కడ మాటువేసి ఉన్న బొంత శివ అనే యువకుడు ఆమెను చెరపట్టి నోట్లో గుడ్డలుకుక్కి లైంగికదాడి చేశాడని తెలిపారు. సంఘటన జరిగిన అనంతరం ఆమె గట్టిగా కేకలు వేయగా బాధితురాలి భర్త అక్కడికి రావడంతో శివ పారిపోయాడని ఎస్సై తెలిపారు.

రెండు సంవత్సరాల క్రితం కూడా బాధితురాలు తమ వ్యవసాయ పొలంలో ఒంటరిగా పనులు చేసుకుంటుండగా శివ ఆమెపై లైంగికదాడి చేశాడని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు. అతడి వేధింపులు భరించలేక ఆమె చాలా కాలం ఊరు విడిచి వెళ్లి తల్లిగారి ఇంటి వద్ద ఉండి ఇటీవలే గ్రామానికి వచ్చిందని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శివపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement

Next Story