sexual assault : దారుణం...ఘట్కేసర్​లో యువతిపై లైంగికదాడి

by Sridhar Babu |
sexual assault : దారుణం...ఘట్కేసర్​లో యువతిపై లైంగికదాడి
X

దిశ, ఘట్కేసర్ : మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న యువతిపై నెల రోజుల క్రితం లైంగికదాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘట్కేసర్ పట్టణం బాలాజీ నగర్ కు చెందిన బషీర్ (38) అనే వ్యక్తి యువతి పనిచేస్తున్న సూపర్ మార్కెట్ లోనే పనిచేస్తున్నాడు. సూపర్ మార్కెట్ లో నెలరోజుల క్రితం బషీర్ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు.

నిజంగానే విషయం బయట పెడితే తనని చంపేస్తాడేమోనని భయంతో తల్లిదండ్రులకు, సహ ఉద్యోగులకు చెప్పుకోలేక లోలోపల మానసికంగా కృంగిపోయింది. మూడు రోజుల క్రితం పనిచేస్తున్న చోట కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. గర్భవతి అయినట్టు భయపడి తనకు జరిగిన అన్యాయంపై ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు బషీర్​ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story