ఛీ ఛీ.. అమ్మాయిలనే కాదు..అబ్బాయిలను కూడా వదట్లేదు!

by GSrikanth |
ఛీ ఛీ.. అమ్మాయిలనే కాదు..అబ్బాయిలను కూడా వదట్లేదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సమాజంలో కొందరు నీచులు అమ్మాయిలనే కాదు అబ్బాయిలనూ వదిలిపెట్టడం లేదు. ఒంటరిగా బయటకు వెళితే చాలు ఆడ, మగ తేడాలేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలా ఓ మైనర్ బాలుడిపై ఓ వ్యక్తి లైంగికంగా వేధించిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... ‘తమిళనాడులోని విల్లివాక్కం జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలుడు ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వచ్చాడు. ఇదే సమయంలో అటువైపు బైక్ పై వెళుతున్న బాలచంద్రన్(47) కన్ను ఈ మైనర్ బాలుడిపై పడింది. దీంతో అభం శుభం తెలియని బాలుడికి మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకున్నాడు. నిర్మానుష్యంగా వుండే ఓ బ్రిడ్జి కిందకు బాలున్ని తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు.

అయితే అతడు ఏం చేస్తున్నాడో అర్థంకాక బాలుడు గట్టిగా ఏడవడంతో స్థానికులు విన్నారు. వెంటనే అక్కడికి చేరుకుని ఏడుస్తున్న బాలుడిని ఏమైందని ప్రశ్నించారు. దీంతో బాలచంద్రన్ లైంగిక వేధింపుల విషయం బయటపడింది’అని వెల్లడించారు. కాగా, బాలుడి మాటలువిని కంగుతిన్న స్థానికులు పారిపోడానికి ప్రయత్నించిన బాలచంద్రన్‌ను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని బాలచంద్రన్‌తో పాటు బాలుడిని కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుడి వద్ద ఓ పార్టీ జెండా, ఐడీకార్డు లభించడంతో అతడు ఆ జాతీయ పార్టీ కార్యకర్తగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story