శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.45 కోట్ల డ్రగ్స్ పట్టివేత

by Satheesh |
శంషాబాద్ ఎయిర్ పోర్టులో రూ.45 కోట్ల డ్రగ్స్ పట్టివేత
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.45 కోట్లు చేసే హెరాయిన్‌తో వచ్చిన మహిళను శంషాబాద్​ఎయిర్​పోర్టులో డైరెక్టరేట్​ఆఫ్​రెవెన్యూ ఇంటెలిజెన్స్​(డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. దోహా నుంచి హైదరాబాద్​వస్తున్న ఓ మహిళ పెద్ద మొత్తంలో డ్రగ్స్​తీసుకు వస్తున్నట్టుగా డీఆర్ఐ అధికారులకు పక్కాగా సమాచారం అందింది. ఈ క్రమంలో విమానాశ్రయంలో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులకు దోహా నుంచి వచ్చిన మహిళ సూట్​కేసులో పెద్ద మొత్తంలో హెరాయిన్​దొరికింది. సూట్​కేసులో ప్రత్యేకంగా అమర్చిన దాంట్లో ఈ డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్టు డీఆర్ఐ అధికారులు చెప్పారు.

Advertisement

Next Story