- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాళం వేసిన రెండు ఇళ్లల్లో దోపిడీ.. భారీగా నగదు, బంగారం చోరీ
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: తాళం వేసిన ఇండ్లే టార్గెట్ గా చేసుకొని దొంగలు వరుసగా రెండు ఇళ్లల్లో చోరికి తెగబడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా నల్లబెల్లి రోడ్డులోని ప్రిజం స్కూల్ సమీపంలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన బిట్ల బాలరాజు మూడు రోజుల క్రితం స్వంత పనుల నిమిత్తం ఇతర గ్రామం వెళ్లి తిరిగి బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం తీసి సామాగ్రి చిందరవందర పడి ఉన్నాయి.
బీరువాలో ఉన్న రూ. 2లక్షల నగదు, ఎనిమిది తులాల బంగారం ఆభరణాలు దోపిడీకి గురైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించారు. ఇదే మాదిరి గత సోమవారం రాత్రి సమీపంలోని కసిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లోనూ రెండు తులాల బంగారం, 40 వేల నగదు చోరికి గురైనట్లు తెలిసింది. కాగా ఈ రెండిళ్లనూ ఒకే సారి దోచుకున్నట్లు అనుమానిస్తున్నారు.