Robbers Attack: పట్టపగలే దోపిడీ దొంగల కాల్పులు.. క్యాష్ బాక్స్‌తో పరార్

by Shiva |   ( Updated:2025-01-16 08:54:27.0  )
Robbers Attack: పట్టపగలే దోపిడీ దొంగల కాల్పులు.. క్యాష్ బాక్స్‌తో పరార్
X

దిశ, వెబ్‌డెస్క్/జహీరాబాద్: పట్టపగలే దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన భయానక ఘటన కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని బీదర్‌ (Bidar)లో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌బీఐ ఏటీఎం (ATM)లో డబ్బు జమ చేసేందుకు వెళ్తున్న వాహనాన్ని దోపిడీ దొంగలు చాకచక్యంగా అడ్డుకున్నారు. అనంతరం వాహనం వెంట ఉండే సెక్యూరిటీ సిబ్బందిపై విచక్షణారహితంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు (Security Guard) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోకరికి బుల్లెట్ (Bullet) గాయాలయ్యాయి. అనంతరం వాహనంలోని నగదు పెట్టెను దొంగలు బైక్‌పై పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని చిరాకుపల్లి ఇతర పోలీస్ స్టేషన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది బృందాలుగా విడిపోయి దోపడీ దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆ రూట్లో వచ్చే ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయితే, దుండగులు ఎత్తుకెళ్లిన క్యాష్ బాక్స్‌లో దాదాపు రూ.కోటి ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది.

Next Story