బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు స్పాట్ డెడ్.. మరో 15 మందికి గాయాలు

by Satheesh |
బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు స్పాట్ డెడ్.. మరో 15 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుల్దానా జిల్లాలో మంగళవారం ఓ ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఘటనలో మృతి చెందిన వారి వివరాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story