మూడు చోట్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Hamsa |
మూడు చోట్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆదివారం జరిగిన మూడు వేర్వేరు రోడ్ ప్రమాదాల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి..ద్విచక్ర వాహనంలో వెళుతున్న వాలంటీర్ ను లారీ ఆర్సిపురం జంక్షన్ వద్ద ఢీకొన్న ఘటనలో షేక్షావలి వాలంటీర్ మృతి చెందింది. అలాగేశ్రీకాళహస్తి స్వామి వారి దర్శనానికి వెళుతుండగా పానగల్ నక్కల కాలనీ వద్ద ద్విచక్ర వాహనం నుండి క్రింద పడ్డ మహిళపై లారీ దూసుకెళ్లిన ఘటనలో హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన అమరావతి మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న కుటుంబం ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో కాంతమ్మ మృతి చెందగా, భర్త చంద్రమోహన్ ,పిల్లలు జనార్ధన్, నరేష్ కు గాయాలు. మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిటిఎం సమీపంలోనున్న తట్టివారి పల్లి వద్ద ఘటన. ముదివేడు మండలం సిద్ధూళ్ళపల్లి వారికి చెందినవారుగా పోలీస్ లు గుర్తించారు.

Advertisement

Next Story