నల్లగొండ నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం.. నర్సింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ..

by Mahesh |   ( Updated:2022-12-12 05:16:40.0  )
నల్లగొండ నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం.. నర్సింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ..
X

దిశ, నకిరేకల్: నల్లగొండ నకిరేకల్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నర్సింగ్ కాలేజీ బస్సును వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది నర్సింగ్ విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో నకిరేకర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్ర గాయాలైన వారిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 30 మంది విద్యార్థినులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న నకిరేకల్ పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని తక్షణ చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదం సూర్యాపేట నుంచి నల్లగొండకు నర్సింగ్ విద్యార్థులు పరీక్షకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేటలోని అపర్ణ నర్సింగ్ కాలేజ్, భవాని నర్సింగ్ కాలేజీలకు చెందిన 30 మంది విద్యార్థులు సోమవారం ఉదయం బస్సులో పరీక్షకు బయలుదేరారు. నకిరేకల్ బైపాస్ వద్దకు రాగానే వెనక నుంచి లారీ బలంగా ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది.

Read More....

మూడు నెలలుగా మిస్సింగ్.. విద్యార్థి అనుమానాస్పద మృతి

Advertisement

Next Story