- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన పెద్దపల్లి జిల్లా (Peddapally District) రంగంపల్లి (Rangampally) రాజీవ్ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగంపల్లి గ్రామం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపుతప్పి ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.