అగ్ని ప్రమాదంలో రూ.60 వేల ఆస్తినష్టం..

by Sumithra |
అగ్ని ప్రమాదంలో రూ.60 వేల ఆస్తినష్టం..
X

దిశ, తుంగతుర్తి : మండల కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం సంభవించి పలువురు రైతులకు చెందిన గడ్డివాములు, వివిధ రకాల వ్యవసాయ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ మేరకు దాదాపుగా రూ.60 వేల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. షేక్ మీరాసాబ్, షేక్ యాకుబ్ అలీ, షేక్.యాకుబ్ ల వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. ఈ మేరకు అకస్మాత్తుగా అక్కడున్న గడ్డివాములకు నిప్పు అంటుకుంది. నాలుగు గడ్డివాములతో పాటు వ్యవసాయానికి సంబంధించిన వివిధ రకాల పైపులు, వ్యవసాయ ఇంజన్ పంప్ సెట్ పూర్తిగా కాలిపోయాయి. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed