- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్జరీ కేసులో ఇద్దరు అరెస్ట్
దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలో ఎన్నారై మహిళకు చెందిన భూమిని అక్రమంగా తమ పేర్లపై పట్టాలు చేయించుకున్న ఇద్దరిని శుక్రవారం అరెస్టు చేసినట్లు 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు తెలిపారు. మాలపల్లికి చెందిన హలీమాబేగం అనే మహిళ అమెరికాలో నివసిస్తుంది. ఆమెకు మాలపల్లిలో 7వ నంబర్ ప్లాట్ ఉంది. సంబంధిత మహిళ విదేశాల్లో ఉండడంతో మహ్మద్ అబ్దుల్ ముఖీద్, ముజాజుద్దీన్ సిద్దిఖీ, అహ్మద్ నబీ(డాక్యుమెంట్ రైటర్), ఇమ్రాన్ (ఆన్ లైన్ సెంటర్), రైసహుస్సెనీ అనే ఐదుగురు కుట్రపూరితంగా నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసుకుని 2022 ఫిబ్రవరిలో సంబంధిత ప్లాట్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
ఆమెరికా నుంచి వచ్చిన హలీమాబేగం ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి అందులో ముగ్గురిని ఇదివరకే అరెస్టు చేశారు. శుక్రవారం రైసహుస్సెనీ, ఇమ్రాన్ లను అరెస్టు చేసినట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. ఓపెన్ ప్లాట్ల యజమానులు ఖచ్చితంగా కంపౌండ్ లు నిర్మించుకోవాలని, ఏవైనా ఆక్రమణలు జరిగితే ఫిర్యాదు చేయాలన్నారు.