- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ తగాదాల్లో ఒకరి హత్య, నేరస్థుల అరెస్ట్
దిశ, కాసిపేట : మండలంలోని అశోక్ నగర్ లో ఇటీవల జరిగిన హత్య కేసులోని ముగ్గురు నేరస్థులను మంగళవారం అరెస్ట్ చేసినట్లు సీఐ ప్రమోద్ రావు, కాసిపేట ఎస్సై గంగారాం తెలిపారు. అనంతరం వారు కేసు వివరాలు వెల్లడించారు. కొన్ని సంవత్సరాలుగా మృతురాలు వేముర్ల ఎల్లమ్మ (56) కుటుంబానికి, నేరస్తుల కుటుంబానికి గొడిసెల కళ్యాణ్(27) ఏ1, గోడిసెల బాలయ్య (53) ఏ2, గొడిసెల లక్ష్మీ (46) ఏ3, మధ్య అశోక్ నగర్ శివారులో ఉన్న భూమి విషయంలో గొడవలు నడుస్తున్నాయి. ఈ విషయమై మృతురాలు, నేరస్తులపై కాసిపేట్ పోలీస్ స్టేషన్ లో, ఉట్నూర్ ఐటీడీఏ కోర్ట్ లో కేసులు పెట్టారని తెలిపారు. నేరస్తులను పోలీస్ స్టేషన్ ల చుట్టూ, కోర్ట్ ల చుట్టూ తిప్పిస్తు ఖర్చుల పాలు చేస్తున్నారని తెలిపారు.
భూమి విషయమై ఎల్లమ్మ ప్రతి సారి నేరస్తులను తిట్టేదని తెలిపారు. మృతురాలు నేరస్థులను అనవసర ఖర్చుల పాలు చేస్తుందని ఆమెను ఎలాగైనా చంపాలనుకున్నారని తెలిపారు. అప్పుడే వారి భూమి వారికి వస్తుందని అనుకొని నేరస్తులు ముగ్గురు కలిసి మృతురాలిని చంపే సమయం కోసం ఎదురు చూశారని తెలిపారు. మృతురాలు తన తల్లి ఇంటికి వెళ్ళి వచ్చే సమయంలో చంపాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం గొడిసెల బాలయ్య, గొడిసెల లక్ష్మిలు కలిసి ఎల్లమ్మ తో గొడవపడుతున్న సమయంలో గొడిసెల కళ్యాణ్ వెనకనుంచి వచ్చి ఎల్లమ్మను గొడ్డలితో నరికారు. ఆ తరువాత మిగిలిన ఇద్దరు నేరస్థులు కూడా మృతురాలిని ఎక్కడ బడితే అక్కడ నరికి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు నేరస్థులను మంగళవారం అరెస్టు చేసారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.