- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
అక్రమ వడ్డీ వ్యాపారస్తులపై పోలీసుల కొరడా
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలో అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ లు నిర్వహిస్తున్న వారిపై శుక్రవారం పోలీసులు కోరడా ఝులిపించారు. జిల్లా వ్యాప్తంగా 24 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద సుమారుగా 80 లక్షల రూపాయల విలువ గల 216 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించినా, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు తమకున్న అత్యవసర పరిస్థితి, అవసరాల కోసం అక్రమ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయం, డయల్100 కు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. సమగ్ర విచారణ చేసి బాధితులకు న్యాయం చేయడం లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.