- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telugu Crime News : రాహుల్ యాత్రలో కొత్త టెన్షన్.. వారి ఫొటోలు విడుదల చేసిన పోలీసులు!
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ఆయా వర్గాల ప్రజలను కలుస్తూ వారితో రాహుల్ గాంధీ సెల్ఫీలు దిగుతూ వారితో మమేకం అవుతున్నారు. కాగా, ఉత్సాహంగా సాగుతున్న పాదయత్రలో జేబు దొంగల ముఠాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పిక్ పాకెటర్స్ రెచ్చిపోవడం నాయకులను టెన్షన్ పెట్టిస్తోంది. కేరళలోని కరమన పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నలుగురు జేబు దొంగల ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. సీసీ పుటేజ్ ఆధారంగా వారిని అధికారులు గుర్తించారు. సోమవారం యాత్ర నెమమ్‌లోని వెల్లాయని జంక్షన్ నుంచి పట్టం వరకు సాగింది. యాత్రలో ఉన్న ఇద్దరు సభ్యులు తమ పర్సులు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం జరిపిన విచారణలో యాత్రలో జేబు దొంగల ముఠాలు ప్రవేశించినట్లు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నలుగురు సభ్యుల ముఠా నేమోమ్ నుంచి యాత్రలో చేరినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ముఠాను త్వరలోనే పట్టుకుంటామని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ గ్యాంగ్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్న నలుగురు వ్యక్తుల ఫొటోలను పోలీసులు సేకరించారు. వీరు రెండు చోట్ల జేబు దొంగతనాలకు పాల్పడుతున్న దృశ్యాలు కూడా పోలీసులు సేకరించారు. రాహుల్ గాంధీ వెంట నడుస్తూ, ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపుతున్న వారి జేబులను టార్గెట్‌గా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, నిందితులు ఇంతకుముందు కూడా పలు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఉత్సాహంగా సాగుతున్న పాదయాత్రలో జేబుదొంగలు ప్రవేశించడం పాదయాత్రలో పాల్గొంటున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది.