person died : అనుమానాస్పదంగా వ్యక్తి మృతి...అధికారుల విచారణ

by Sridhar Babu |
person died : అనుమానాస్పదంగా వ్యక్తి మృతి...అధికారుల విచారణ
X

దిశ, శామీర్ పేట : అనుమానాస్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఫారుక్​(41) అలియాబాద్ గ్రామ పరిధిలోని హెచ్బీఎల్ కంపెనీ సమీపంలోని సర్వే నెంబర్ 580 లో ఉన్న వ్యవసాయ భూమిలో ఆరు సంవత్సరాలుగా సూపర్వైజర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా రోజు వారీలాగే గార్డెన్ లో పని చేస్తుండగా మధ్యాహ్నం 12 గంటలకు కళ్లు తిరుగుతున్నాయని, తన గదిలో పడుకుంటానని తనతో పాటు పనిచేస్తున్న జనార్ధన్​కు చెప్పి వెళ్లిపోయాడు.

సాయంత్రమైనా ఫారుక్ బయటకు రాకపోవడంతో గదిలోకి వెళ్లి చూడగా మంచంపై నోట్లో నుంచి నురగ వచ్చి వాంతి చేసుకుని చనిపోయి ఉన్నాడు. విషయాన్ని గమనించిన జనార్ధన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పాముకాటుతో కానీ, ఇతర అనారోగ్య సమస్యలతో కానీ మృతి చెంది ఉంటాడని పోలీస్ లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story