రైలుకింద పడి ఒకరి మృతి

by Shiva |   ( Updated:2023-05-02 17:27:37.0  )
రైలుకింద పడి ఒకరి మృతి
X

దిశ, రామకృష్ణాపూర్: గుర్తు తెలియని రైలుకింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ సరోజ్(35)గా గుర్తించినట్లు తెలిపారు. సరోజ్ గత కొన్ని రోజులుగా జగిత్యాలలో ఒక పండ్ల గోదాంలో పని చేస్తున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు.

Advertisement

Next Story