టీచర్ను ఉరికించి ఉరికించి కొట్టిన పేరేంట్స్.. కారణమిదే..!

by Javid Pasha |   ( Updated:2023-03-22 14:18:05.0  )
టీచర్ను ఉరికించి ఉరికించి కొట్టిన పేరేంట్స్.. కారణమిదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని విద్యార్థి తల్లిదండ్రులు ఉరికించి ఉరికించి కొట్టారు. ఈ ఘటన తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టుటికోరిన్ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఆర్.భరత్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో రెండో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థిని సదరు టీచర్ తనను బాగా కొట్టాడని తల్లిదండ్రులు శివలింగం, సెల్వీ, తాత మునిస్వామిలకు ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తులపైన ఆ విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తరగతి గదిలో పాఠాలు చెబుతున్న సదరు ఉపాధ్యాయుడిపై వాగ్వివాదానికి దిగారు. పిల్లలను కొట్టే హక్కు ఎవరిచ్చారంటూ నిలదీశారు. అయితే తాను ఆ విద్యార్థిని కొట్టలేదని ఆ టీచర్ ఎంత చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. ఇక విద్యార్థిని తండ్రి, తల్లి, తాత టీచర్ పై దాడికి యత్నించగా సదరు టీచర్ భరత్ వాళ్ల నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి పరుగులు పెట్టాడు.

అయినా అతని వెంటే పరుగెత్తిన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఆ టీచర్ ను దొరకబట్టి ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అయితే వెంటనే అక్కడికి వచ్చిన మిగతా టీచర్లు ఆ టీచర్ ను కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు ఆమె తాత మునిస్వామిని కూడా పోలీసులు అరెస్జ్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా.. క్లాస్ లో బాగా అల్లరి చేస్తోందని, చదవడం లేదనే కారణాలతోనే ఆ విద్యార్థినిని వెనుక బెంచీ నుంచి ముందు బెంచీకి రావాలని సదరు టీచర్ చెప్పారని, అయితే ముందుకు బెంచీకి వస్తున్న క్రమంలో కిందపడటంతో ఆ విద్యార్థికి చిన్నపాటి గాయలైనట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story