- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్లైన్ ప్రేమ విఫలమై.. యువకుడు ఆత్మహత్య..
దిశ,నెక్కొండ: ఆన్లైన్ ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం… అప్పల్రావుపేట గ్రామానికి చెందిన జిల్లా.వినయ్(25) అనే యువకుడు కొన్ని సంవత్సరాల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఆన్లైన్ లో హైదరాబాద్ లో ఉండే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయమయ్యింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమలో పడ్డ యువకుడు సదరు యువతికి వేరే వ్యక్తితో ఇటీవల పెళ్లి కుదిరినట్లు తెలిసింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన వినయ్ సుమారు ఐదు రోజుల కిందట క్రిమిసంహారక మందు సేవించాడు.హైదరాబాద్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.