ఎదురెదురుగా వాహనాలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

by Kalyani |
ఎదురెదురుగా వాహనాలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
X

దిశ, మొయినాబాద్: రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా, నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన హైదరాబాద్ బీజాపూర్ అంతర్ రాష్ట్ర రహదారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి పరిగికి వెళ్తున్న ట్రక్కు చేవెళ్ల నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న హోండా సిటీ కారు రాంగ్ రూట్లో వెళ్లి ట్రక్కును ఢీకొనగా కారులో ఉన్న ఐదుగురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని మీరాళంమండి ప్రాంతానికి చెందిన ఎండి ఉబైడ్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు.

మిగతా నలుగురికి తీవ్రమైన రక్త గాయాలు కావడంతో నానాల్ నగర్ లోని ప్రీమియర్ హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. గాయాలైన వారిలో కార్వాన్ తప్పాఛపుత్ర ప్రాంతానికి చెందిన మహమ్మద్ కాజా, మహమ్మద్ ఇస్మాయిల్, తప్పాఛపుత్ర అంబేద్కర్ కాలనీకి చెందిన కారు యజమాని ఎండీ ఇబ్రహీం, ఎండీ నయీమ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. ఎండి నయీమ్ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మొయినాబాద్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లక్ష్మీరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story