డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు

by Shiva |
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
X

దిశ, కామారెడ్డి రూరల్ : మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి జైలు శిక్ష విధించినట్లు దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. ఈ నెల 26న మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మాణిక్ బండారుకు చెందిన జనగామ గంగాధర్ ను కోర్టులో హాజరుపరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ప్రతాప్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.300ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించిన్నట్లు ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వారిని అరెస్టు చేసి కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story