కుక్క దాడిలో వృద్ధుడికి గాయాలు..

by Kalyani |
కుక్క దాడిలో వృద్ధుడికి గాయాలు..
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: కంటోన్మెంట్ ఐదో వార్డు మహేంద్ర హిల్స్, శాంతినికేతన్ కాలనీలో ప్రకాష్ (71) నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం సమయంలో ఫోన్ లో మాట్లాడుతూ వాకింగ్ చేస్తుండగా బుద్ధ విహార్ ప్రాంతంలో వెనకాల నుంచి వచ్చిన కుక్క కాలుని కరిచింది. ప్రకాష్ కింద పడిపోవడంతో ఎడమ కన్ను కింది భాగంలో కూడ తీవ్ర గాయమైంది. ప్రకాష్ ఇంటికి వెళ్లి కంటోన్మెంట్ అధికారులకు సమాచారాన్ని తెలపడంతో స్పందించిన బోర్డ్ అధికారులు కుక్క ను తీసుకెళ్లారు.

Advertisement

Next Story