30 కాదు.. 59 ముక్కలుగా నరికి మహిళ దారుణ హత్య

by Mahesh |
30 కాదు..  59 ముక్కలుగా నరికి మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఒంటరిగా ఉన్న మహిళను ఓ వ్యక్తి.. అతి కిరాతంగా హత్య చేసి ఆమె శరీరాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో పెట్టారు. ఈ అత్యంత ఘోరమైన సంఘటన బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో మూడు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు మహిళా ఇంట్లోని రిఫ్రిజిరేటర్‌లో ఆమె శరీరభాగాలను చూసి అవక్కయ్యారు. వారం రోజుల క్రితం మహిళ హత్య జరిగి ఉంటుందని పోలీసులు గుర్తించారు. కాగా ఈ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోస్టుమార్టం అనంతరం.. మహిళ శరీరాన్ని నింధితుడు 59 ముక్కలుగా నరికి నట్లు గుర్తించారు. కాగా మృతురాలు మహాలక్ష్మీ సంవత్సరం క్రితం తన భర్తతో విడిపోయి.. మల్లేశ్వరం ప్రాంతంలోని ఓ మాల్ లో పనిచేస్తూ.. ఒంటరిగా ఉంటుందని.. ఈ సమయంలో మాల్ లో తమ టీమ్ లీడర్ గా ఉన్న ఓ వ్యక్తితో రిలేషన్ కొనసాగించింది. ఇదే సమయంలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం రంజన్ గమనిచాడని.. ఈ క్రమంలోనే అతని మహాలక్ష్మిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కాగా ఈ హత్యకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed