Murder Case: బెంగళూరు మహిళా హత్య కేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితుడు ఆత్మహత్య !

by vinod kumar |
Murder Case: బెంగళూరు మహిళా హత్య కేసులో ట్విస్ట్.. ప్రధాన నిందితుడు ఆత్మహత్య !
X

దిశ, నేషనల్ బ్యూరో: బెంగళూరులోని వయాలికేవల్ ప్రాంతంలో మహాలక్ష్మి అనే మహిళ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావించిన మహాలక్ష్మి సహోద్యోగి ముక్తి రంజన్ రాయ్ ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. హత్య జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న రంజన్ మృతదేహాన్ని ఒడిశాలోని భద్రక్ జిల్లా ధుసూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో పోలీసులు గుర్తించారు. హత్య తర్వాత రంజన్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడని రాత్రి బసచేసి వెళ్లిపోతానని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. బైక్ పై బయలు దేరిన ఆయన అనుమానాస్పదంగా చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మృత దేహానికి సమీపంలో ఉన్న రంజన్ ల్యాప్ టాప్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత దర్యాప్తు చేపట్టనున్నట్టు తెలిపారు.

59 ముక్కలుగా మృత దేహం

అంతకుముందు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. మహిళ మృత దేహాన్ని 59 ముక్కలుగా నరికినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైనట్టు తెలిపారు. మహాలక్ష్మితో కలిసి పని చేసిన ముక్తి రంజన్ రాయ్ అనే సహోద్యోగిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు. మహాలక్ష్మితో పనిచేసిన ముక్తి, మరొక వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడని ఈ క్రమంలోనే హత్యకు కుట్ర పన్ని ఉంటాడని పోలీసులు భావించారు. ఒడిశా-పశ్చిమ బెంగాల్ సరిహద్దులో నిందితుడు దాగి ఉండొచ్చనే అనుమానంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రంజన్ మృతదేహం లభ్యమవ్వడం గమనార్హం. కాగా, ఈ నెల 21న మహాలక్ష్మిని హత్య చేసి అనంతరం ఆమె మృతదేహాన్ని 30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed