- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కండలు పెంచే ఇంజక్షన్లు మత్తు కోసం వినియోగం
దిశ, సిటీక్రైం : జిమ్ లో వ్యాయామం చేస్తూ వేగంగా కండలు పెరగడానికి ఉపయోగించే మేఫిన్ టర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను మత్తు కోసం విక్రయిస్తున్నారు. దాంతో వీటిని విక్రయిస్తున్న టెక్నీషియన్ ను హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ జోనల్ క్రైం టీం, డ్రగ్ ఇన్స్పెక్టర్లు సంయుక్తంగా శనివారం అరెస్ట్ చేశారు. స్పెషల్ పోలీస్ టీం వెల్లడించిన వివరాల ప్రకారం...అసిఫ్ నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆఫ్ఫాన్ (22) వృత్తి రీత్యా టెక్నీషియన్. సీసీఎస్ స్పెషల్ పోలీపులకు అందిన సమాచారంతో ఆఫ్ఫాన్ ఇంట్లో సోదాలు జరిపారు.
ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన మేఫిన్ టర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని వైద్యుల సూచన లేకుండా వాడడం ప్రమాదకరమని, ఈ ఇంజక్షన్లను తీసుకోవడం వల్ల మత్తులోకి జారుకుని విచిత్రంగా ప్రవర్తిస్తారని పోలీసులు తెలిపారు. వ్యాయామం చేసినప్పుడు శరీర కండలు త్వరగా పెరిగేందుకు ఉపయోగిస్తారని పోలీసులు వివరించారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురవుతారని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజక్షన్లతో పాటు ఆఫ్ఫాన్ ను మెహదీపట్నం జోన్ డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ కు అప్పగించారు.
- Tags
- injections