Tragic incident:అర్ధరాత్రి తల్లి, కుమారుడి దారుణ హత్య

by Jakkula Mamatha |   ( Updated:2024-11-23 10:34:08.0  )
Tragic incident:అర్ధరాత్రి  తల్లి, కుమారుడి దారుణ హత్య
X

దిశ,వెబ్‌డెస్క్: ఏలూరు జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మండవల్లి మండలం గన్నవరం గ్రామానికి చెందిన రొయ్యూరు భ్రమరాంబ (60), ఆమె కుమారుడు సురేష్ (35)ను నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పీక కోసి దారుణంగా హతమార్చారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్‌తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అయితే మృతురాలి సోదరి కుమారుడితో ఇటీవల ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆస్తి వివాదాలు ఈ హత్యకు దారితీసాయని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు(5), కుమార్తె(3) ఉన్నారు. అయితే సురేష్.. భార్య తండ్రి సంవత్సరికం కావడంతో భార్య పిల్లలతో శుక్రవారం ముసునూరులో వదిలి.. తల్లి ఒంటరిగా ఉంటుందన్న కారణంతో తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అయితే భర్త మరణ వార్త తెలుసుకుని నివాసానికి చేరుకున్న సురేష్ భార్య ఇద్దరు పిల్లలతో కలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed