ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం..

by Kalyani |
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం..
X

దిశ, నవాబుపేట: తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండల పరిధి కూచూరు గ్రామంలో జరిగింది. ఎస్ఐ పురుషోత్తం తెలిపిన వివరాల ప్రకారం.. 10 సంవత్సరాల క్రితం కూచూరు గ్రామానికి చెందిన తుప్పుడ లింగం అదే గ్రామానికి చెందిన పిట్టల మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి సాయిచైతన్య, సాయి పల్లవిలు సంతానం. కాగా ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో భార్యా పిల్లలు ఇంట్లో ఉండగా పోలేపల్లి సెజ్ లో గల ఓ కంపెనీలో పని చేయడానికి లింగం వెళ్లాడు.

సోమవారం ఉదయం 7.30 గంటలకు విధులు ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చిన అతనికి ఇంటి వద్ద భార్యా పిల్లలు కనిపించలేదు. ఆచూకీ కోసం పరిసర ప్రాంతాలు, బంధువులను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో మంజుల భర్త తుప్పుడ లింగం మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది ఇలా ఉంటే మూడు సంవత్సరాల క్రితం కూడా తన భార్య మంజుల తనను, తన పిల్లలను వదిలి సుమారు 15 నెలలు ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చిందని లింగం తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story