- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం..పర్యవేక్షణ లోపమే కారణమా..?
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం రాయల్ గండి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ పాఠశాల/ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైంది. అనారోగ్యంతో ఉన్న ఆ విద్యార్థిని వారం పది రోజుల పాటు ఇంటికి వెళ్లి తిరిగి గురువారం సుమారు 11 గంటల సమయంలో పాఠశాలకు తల్లిదండ్రులు వచ్చి వదిలేసే వెళ్లినట్లు తెలిసింది. అనంతరం ఏదో కారణం చెప్పి పాఠశాల నుండి ఆ విద్యార్థిని గురువారం సాయంత్రం 3.45 గంటల తర్వాత పాఠశాల నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. విద్యార్థిని ఆ విధంగా వెళ్లడానికి ముమ్మాటికి కారణం పాఠశాల ఎస్ ఓ నిర్లక్ష్యం ముమ్మాటికి కనిపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సంఘటనకు సంబంధించి కేజీబీవీ ఎస్ఓ ఉమాదేవిని ఏం జరిగిందో తెలుసుకునేందుకు దిశ ఫోన్ ద్వారా చాలా సార్లు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఈ విషయంపై పదరా ఎస్సై ఎస్సై ని దిశ శుక్రవారం ఉదయం ఫోన్ చేసి వివరణ కోరగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థిని పాఠశాల నుండి మిస్ అయిన విషయం వాస్తవం అని, ఆ విద్యార్థిని ఒక ఆటోలో వెళ్లిపోయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. కావున విద్యార్థి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సద్దాం దిశకు ఫోన్ ద్వారా తెలిపారు.