ఢిల్లీ మర్డర్ కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హంతకుడు సాహిల్

by Javid Pasha |   ( Updated:2023-05-31 07:18:07.0  )
ఢిల్లీ మర్డర్ కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హంతకుడు సాహిల్
X

దిశ, వెబ్ డెస్క్: తనను కాదంటూ ఇంకో వ్యక్తితో చనువుగా ఉంటోందనే కోపంతో సాహిల్ అనే వ్యక్తి తన ప్రియురాలు సాక్షిని అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కత్తితో 22 సార్లు ఆమెను పొడిచిన నిందితుడు అనంతరం బండరాయితో ఆమె తలను ఛిద్రం చేశాడు. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హంతకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సాహిల్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన ప్రియురాలిని హత్య చేసిన తర్వాత సాహిల్ దాదాపు అర్ధ గంటకు పైగా హత్యా ప్రదేశంలో తిరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం దగ్గర్లోని పార్కుకు వెళ్లి అక్కడ కొంత సేపు కూర్చున్నాడని, తర్వాత రిథాల అనే ప్రదేశంలో కత్తిని పారేశాడని తెలిపారు.

ఇక్కడే సాహిల్ తన మొబైల్ ను స్విచ్ఛాఫ్ చేసినట్లు చెప్పారు. అక్కడి నుంచి సమయాపూర్ బద్లీ కి రిక్షాలో వెళ్లి అక్కడే ఓ మెట్రో స్టేషన్ లో ఆ రాత్రి నిద్రపోయినట్లు సాహిల్ పోలీస్ విచారణలో తెలిపాడు. ఇక మరుసటి రోజు ఉదయం సమయాపూర్ బద్లీ నుంచి ఆనంద్ విహార్ అక్కడి నుంచి బులంద్ షహర్ కు పారిపోయినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక సాక్షిని మర్డర్ చేసేందుకు ఉపయోగించిన కత్తిని 15 రోజుల కిందట హరిద్వార్ లో కొన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. కాగా నిందితుడు సాహిల్ ను పోలీసులు బులంద్ షహర్ లో అరెస్ట్ చేశారు.

Read More... టెర్రేస్‌పై పడుకున్నందుకు.. కూతురిని 25 సార్లు పొడిచి చంపిన తండ్రి ( వీడియో)

Advertisement

Next Story