మినీ ట్రక్ టైర్ బ్లాస్ట్.. ఒకరి మృతి

by Shiva |
మినీ ట్రక్ టైర్ బ్లాస్ట్.. ఒకరి మృతి
X

డ్రైవర్ కు తీవ్ర గాయాలు

దిశ, మాచారెడ్డి : మినీ ట్రక్ టైర్ బ్లస్ట్ అయి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయల పాలైన ఘటన మాచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మినీ ట్రక్ డ్రైవర్ పెంటం దేవరాజు సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఘన్ పూర్ శివారులోని పెద్దమ్మ జంగల్ వద్దకు రాగానే ముందరి టైరు బ్లాస్ట్ అయి ట్రక్ అదుపు తప్పి రోడ్డుకు తిరిగింది. అదే సమయంలో బైక్ పై ఎదురుగా వస్తున్న చిప్ప రాజు (40)ను ఢీకొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లింగంపేట మండలం బానాపూర్ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. అతను బాన్సువాడ బీడీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మాచారెడ్డి ఎస్సై సంతోష్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story