సైనిక హెలికాప్టర్లు ఢీ.. 9 మంది దుర్మరణం

by Anjali |
సైనిక హెలికాప్టర్లు ఢీ.. 9 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కెంటకీలో ఢీ కొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్ బెల్ కు 30 మైళ్ల దూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది. 101వ వైమానికి విభాగానికి చెందిన రెండు హెలికాప్లర్లు కూలిపోవడంతో 9 మంది యూఎస్ సర్వీస్ సభ్యులు మరణించారని అధికారలు తెలిపారు. రెండు హెచ్ హెచ్ -60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కూలిపోయాయి. టెన్నెస్సీ సరిహద్దు సమీపంలోని ట్రిగ్ కౌంటి సమీపంలోని ఫోర్ట్ క్యాంప్ బెల్ అధికారులు గురువారం తెల్లవారుజామున ఈ విషయాన్ని తెలిపారు. హెలికాప్టర్ సాధారణ శిక్షణా మిషన్ లో పాల్గొటున్నారు అని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story