కోర్టు బయటే అతడి కాల్చేసిన జవాన్.. పోలీసులు ఏం చేశారంటే..

by Disha News Desk |
కోర్టు బయటే అతడి కాల్చేసిన జవాన్.. పోలీసులు ఏం చేశారంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: రేప్ కేసులో నిందితుడిని ఆర్మీ మాజీ జవాను హత్య చేశాడు. కోర్టు బయటే జవాన్ ఇలా చేయడం అందరిని షాక్‌కు గురిచేసింది. వెంటనే తేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌ గోరఖ్‌పుర్‌లోని కలెక్టరేట్ వద్ద చోటుచేసుకుంది. వారు తెలిపిన దాని ప్రకారం.. మైనర్‌ను రేప్ చేసిన పోక్సో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఇరు వర్గాలు కోర్టుకు హాజరయ్యాయి. అదే సమయంలో బాధితురాలి తండ్రి ఆర్మీ మాజీ జవాను నిందితుడిని కోర్టు బయట కాల్చి చంపేశాడని పోలీసులు తెలిపారు. అయితే అతడిని ప్రజల సహాయంతో అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed